సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో ఓ వ్యక్తి ఎలాంటి భయం లేకుండా భారీ నాగుపాముకు స్నానం చేయిస్తున్నాడు. బాత్‌రూంలో పాముకు స‌దరు వ్యక్తి భ‌యం, తొట్రుపాటు లేకుండా నీళ్ల‌తో క‌డుగుతున్న ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు.పాముకు సెల్ఫ్ ప్రొటెక్ష‌న్‌గా చ‌ర్మం రూపొందుతుంద‌ని, దానికి స్వ‌యంగా శుభ్ర‌ప‌రుచుకునే వ్య‌వ‌స్ధ ఉండ‌గా, అస‌లు నిప్పుతో చెల‌గాట‌మాడాల్సిన అవ‌సరం ఏముంద‌ని వీడియోకు క్యాప్ష‌న్ ఇచ్చారు. ఇక 19 సెకండ్ల వ్య‌వ‌ధి క‌లిగిన ఈ వీడియోలో మ‌గ్ నుంచి నీటిని కోబ్రాపై పోస్తుండ‌టం క‌నిపిస్తుంది.ఆ వ్య‌క్తి పాము త‌ల‌ను కూడా ప‌ట్టుకుని స్నానం చేయించ‌డం ఒళ్లు గ‌గుర్పొడిచేలా చేస్తుంది.

Man bathes massive king cobra in viral video Broke Internet

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)