Newdelhi, Nov 19: నికరాగ్వా (Nicaragua) అందాల భామ షేనిస్ పలాసియోస్ (Sheynnis Palacios) మిస్ యూనివర్స్ 2023(Miss Universe 2023)గా ఎన్నికైంది. ఎల్‌సాల్వడార్ రాజధాని శాన్ సాల్వడార్‌లోని జోస్ అడాల్ఫో పనెడా ఎరీనాలో ఈ రోజు జరిగిన బిగ్ ఈవెంట్ లో షేనిస్ పేరు ప్రకటించగానే ఆడిటోరియం కరతాళ ధ్వనులతో మార్మోగింది. తన పేరు ప్రకటించగానే షేనిస్ కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. అంతకుముందు కొన్ని క్షణాలపాటు ఆడిటోరియంలో నిశ్శబ్దం ఆవరించింది. క్షణాలు ఉద్విగ్నంగా మారాయి. అమెరికాకు చెందిన మిస్ యూనివర్స్ 2022 ఆర్ బోనీ గాబ్రియెల్ విజేత షేనిస్ కు కిరీటం తొడిగింది. మిస్ యూనివర్స్ 2023గా ఎంపికైన షేనిస్ ఆ ఘనత సాధించిన తొలి నికరాగ్వా మహిళగా రికార్డులకెక్కింది. ఆస్ట్రేలియాకు చెందిన మోరయ విల్సన్ సెకండ్ రన్నరప్‌గా నిలవగా, థాయిలాండ్ ముద్దుగుమ్మ అంటోనియా పోర్సిల్డ్ ఫస్ట్ రన్నరప్ గా ఎంపికైంది. మిస్ యూనివర్స్ 2023 అందాల పోటీల్లో చండీగఢ్‌కు చెందిన శ్వేత శారద భారత్ కు ప్రాతినిధ్యం వహించింది. టాప్-20 ఫైనలిస్టుల్లోకి చేరినా ఆ తర్వాత వెనకబడింది.
IND vs AUS, CWC 2023 Final: భారత్ ప్రపంచకప్ గెలవాలని ట్రాన్స్ జెండర్ల ప్రత్యేక పూజలు.. వీడియో ఇదిగో
MISS UNIVERSE 2023 IS @Sheynnispalacios_of !!!! 👑 🇳🇮@mouawad #72ndMISSUNIVERSE #MissUniverse2023 pic.twitter.com/cSHgnTKNL2
— Miss Universe (@MissUniverse) November 19, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)