Newdelhi, Nov 19: భారత్ (India) ప్రపంచకప్ (World Cup) గెలవాలని ప్రతి భారతీయుడు అభిలషిస్తున్నాడు. ఇందుకోసం దేశంలోని పలు ప్రాంతాల్లో తమ నమ్మకాలకు అనుగుణంగా పలువురు మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌ (Uttarpradesh) లోని ప్రయాగ్‌ రాజ్‌ లో ట్రాన్స్‌ జెండర్ల సంఘం (Transgender Community) సభ్యులు ప్రపంచకప్ ఫైనల్‌ లో టీమిండియా విజయం కోసం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ట్రాన్స్‌ జెండర్లు తమ చేతులతో టీమ్ ఇండియా సభ్యుల ఫోటోలను పట్టుకుని పూజల్లో పాల్గొన్నారు. టీమ్‌ ఇండియాకు శుభం జరగాలని అభిలషిస్తూ శంఖం ఊదారు. భగవంతునికి హారతులిచ్చారు. డప్పులు వాయిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ట్రాన్స్‌ జెండర్ల ప్రార్థనలను భగవంతుడు స్వీకరిస్తాడని, వారి పూజలు ఫలవంతమవుతాయిని స్థానికులు చెబుతున్నారు.

Vinod Thomas: ప్రముఖ మలయాళ నటుడి అనుమానాస్పద మృతి.. పార్క్‌ చేసి ఉన్న కారులో విగతజీవిగా కనిపించిన నటుడు వినోద్ థామస్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)