టాలీవుడ్ సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ మీడియా ఓ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. తాను రామ్ చరణ్ స్థాయి తగ్గించేలా మాట్లాడానని ట్రోల్ చేస్తున్నారని తెలిపారు. రామ్ చరణ్ ను ఉద్దేశపూర్వకంగా తాను ఏమీ అనలేదని స్పష్టం చేశారు. దిల్ రాజు పరిస్థితిని వివరించే క్రమంలో తాను మాట్లాడిన మాటలు మరోలా అర్థం చేసుకున్నారని అల్లు అరవింద్ వివరణ ఇచ్చారు.

ఐటీ సోదాలు సర్వసాధారణమే..అవాస్తవాలను ప్రచారం చేయొద్దు అని దిల్ రాజు విజ్ఞప్తి, ఫిబ్రవరి 3న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారని వెల్లడి

ఆ రోజు దిల్ రాజును వేదికపై ఆహ్వానిస్తూ... ఆయన వారం రోజులుగా ఇన్ కమ్ ట్యాక్సు వ్యవహారాలు, కష్టాలు, నష్టాలు అనుభవించారు అని పరిచయం చేయడానికి యథాలాపంగా ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. అవి ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కాదు. దానికి మెగా అభిమానులు చాలా ఫీలయ్యారు... నన్ను ట్రోల్ చేశారు. చరణ్ నా కొడుకులాంటివాడు... నాకున్న ఏకైక మేనల్లుడు.... అతడికున్న ఏకైక మేనమామని.... అందుకే ఎంతో భావోద్వేగంతో చెబుతున్నాను... ప్లీజ్, ఇక ఆ విషయం వదిలేయండి. చరణ్, నాకు మధ్య ఒక అద్భుతమైన అనుబంధం ఉంది. ఆ రోజున దిల్ రాజు లైఫ్ గురించి చెప్పడానికి పొరపాటున అలా మాట్లాడాల్సి వచ్చింది... తర్వాత అలా మాట్లాడకుండా ఉంటే బాగుండు అనిపించింది" అంటూ అల్లు అరవింద్ వివరణ ఇచ్చారు.

మెగా అభిమానులకు క్షమాపణలు చెప్పిన నిర్మాత అల్లు అరవింద్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)