టీమిండియా ఆటగాడు మహమ్మద్ సిరాజ్‌కు హైదరాబాద్‌లో ఘన స్వాగతం లభించింది. శుక్రవారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న అతనికి క్రికెట్ అభిమానులు భారత్ మాతాకీ జై అనే నినాదాల మధ్య స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిరాజ్ మాట్లాడుతూ... ప్రపంచ కప్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. రానున్న రోజుల్లో తాను మరింతగా కష్టపడి భారత జట్టుకు మరిన్ని పథకాలు సాధించే విధంగా కృషి చేస్తానన్నాడు.
ఛాంపియన్‌గా నిలిచిన అనుభూతి వర్ణించడానికి మాటలు రావట్లేదన్నాడు. ఇది హైదరాబాద్‌కు గర్వించదగ్గ క్షణాలు అన్నాడు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి వచ్చిన సిరాజ్‌కు మెహిదీపట్నంలో క్రికెట్ అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అతనిని వాహనంలో ఊరేగించారు. సరోజిని కంటి ఆసుపత్రి నుంచి ఈద్గా మైదానం వరకు రోడ్డు షో నిర్వహించారు. అభివాదం చేస్తూ సిరాజ్ ముందుకు కదిలాడు. బీసీసీఐ నుంచి 125 కోట్ల రూపాయల చెక్కును అందుకున్న టీమిండియా, వాంఖడే స్టేడియంలో లక్షలాది మంది అభిమానుల మధ్య కన్నుల పండుగగా టీమిండియా విక్టరీ పరేడ్
Here's Video
#WATCH | Cricketer Mohammed Siraj arrives in Hyderabad, welcomed by his numerous fans and supporters at the airport pic.twitter.com/5436dqlcKq
— ANI (@ANI) July 5, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)