బ్రిటన్‌కు చెందిన ఓ తల్లి తన కూతురుకి 500 డాలర్లు ఇచ్చి 100 మందితో డేటింగ్ చేయమని చెప్పింది. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఆ యువతి తన అందంతో అబ్బాయిలకు గాలం వేసి ఒకరిద్దరితో కాదు, ఏకంగా 100మంది బాయ్‌ఫ్రెండ్స్‌ను మార్చేసింది. అది కూడా ఒక్క ఏడాదిలోనే కావడం విశేషం.

ఈ విషయాన్ని యువతి సోదరి ఎలిస్ కేరొలీన్ టిక్‌టాక్‌లో షేర్‌ చేయడంతో ఈ వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తల్లి ఇచ్చిన టాస్క్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ చేసినందుకు ఆ యువతికి ఆమె తల్లి గ్రాండ్‌గా వేడుకలు జరిపిందట. కేక్‌పై 100 నెంబర్‌ క్యాండిల్‌తో ఘనంగా సెలబ్రేట్‌ చేసుకున్నారట.దీనిపై తల్లి స్పందిస్తూ.. పెళ్లి తర్వాత తన కూతురికి మగవాళ్ల పట్ల భయం, అనుమానం ఉండకూడదని, అందుకే చాలామంది పురుషులతో డేటింగ్‌కు వెళ్లమని ప్రోత్సహించినట్లు మైండ్‌ బ్లాంక్‌ అయ్యే సమాధానం ఇచ్చింది.

Mom Pays Daughter 500 Dollers to Go on 100 Dates With 100 Guys

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)