Newdelhi, Jan 19: పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు (Suicides), అగ్ని ప్రమాదాల (Fire Accidents) నేపథ్యంలో కోచింగ్ సెంటర్లకు (Coaching Centres) కేంద్రం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. 16 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న విద్యార్థులను కోచింగ్ సెంటర్లు చేర్చుకోకూడదని గైడ్ లైన్స్ స్పష్టం చేశాయి. పాఠశాల స్థాయి విద్య పూర్తయిన తర్వాత మాత్రమే ప్రవేశానికి అనుమతి ఇవ్వాలని సూచించాయి. మంచి ర్యాంకులు లేదా మార్కులు వస్తాయని నమ్మించే ప్రయత్నాలు చేయకూడదని కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లకు ఈ నూతన మార్గదర్శకాలు సూచించాయి. విద్యార్థులు చదువుకోవడానికి అవసరమైన స్థలం, గాలి, వెలుతురు ఉండేలా చూడాలని.. లేకపోతే గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించింది.
Centre issues guidelines for Coaching centres. Prohibits enrollment of students below 16 years of age. pic.twitter.com/gin0IvLdBo
— All India Radio News (@airnewsalerts) January 18, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)