Newdelhi, Nov 10: ఆధార్ కార్డులతో (Aadhar Cards) అనుసంధానించని 11.5 కోట్ల పాన్ కార్డులను (PAN Cards) కేంద్రం డీ యాక్టివేట్ (Deactivate) చేసింది. ఆర్టీఐ విచారణలో ఈ విషయం వెల్లడైంది. ‘ది హిందూ’ ప్రచురించిన కథనం ప్రకారం ఇండియాలో మొత్తం 70.24 కోట్ల పాన్ కార్డులుండగా అందులో 13 కోట్ల కార్డులు ఆధార్ తో లింక్ కాలేదు. ఇందులో ఆధార్ కార్డులతో అనుసంధానించని 11.5 కోట్ల పాన్ కార్డులను కేంద్రం డీ యాక్టివేట్ చేసింది. 2017 జూలై 1 తర్వాత జారీ చేసిన పాన్ కార్డులు మాత్రం ఆటోమేటిగ్గా ఆధార్ తో లింక్ అవుతాయి. డీ యాక్టివేట్ అయిన కార్డులను రీ యాక్టివేట్ చేసుకోవడానికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు రూ.1000 జరిమానాగా విధించింది. ఆర్టీఐ కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ ఈ విషయాన్ని విమర్శించారు. కొత్త పాన్‌కార్డు పొందడానికి రూ.91 ఖర్చవుతున్నప్పుడు దానికి పది రెట్లు ఎక్కువ మొత్తాన్ని రీ యాక్టివేట్ కోసం కేంద్రం జరిమానాగా విధిస్తున్నదన్నారు.
A total of 11.5 crore #PAN cards were deactivated for not being linked to #Aadhaar cards before the stipulated deadline, a Right to Information reply by the Central Board of Direct Taxes stated, @dawalelo reportshttps://t.co/QvzsAbcGtw
— The Hindu (@the_hindu) November 8, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)