Aadhar Most Trusted Digital ID In World: కేంద్ర స‌ర్కార్ జారీ చేస్తున్న ఆధార్ కార్డుల‌పై ఇంట‌ర్నేష‌న‌ల్ క్రెడిట్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్ట‌ర్స్ స‌ర్వీస్ తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించిన సంగతి విదితమే. ఆధార్ కార్డు స‌ర్వీస్ స‌రిగా లేద‌ని, వేడి వాతావ‌ర‌ణంలో బ‌యోమెట్రిక్ టెక్నాల‌జీ న‌మ్మ‌దగిన‌దిగా లేద‌ని మూడీస్ ఆరోపించింది.ఈ ఆరోప‌ణ‌ల‌పై యునిక్ ఐడెంటిఫికేష‌న్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) ప్ర‌క‌ట‌న చేసింది. ఎటువంటి ఆధారాలు లేకుండానే ఆధార్ కార్డుల‌పై మూడీస్ సంస్థ ఆరోప‌ణ‌లు చేసిన‌ట్లు యూఏడీఏఐ పేర్కొన్న‌ది.

ప్ర‌పంచంలోనే ఆధార్ కార్డు అత్యంత న‌మ్మ‌క‌మైన డిజిట‌ల్ ఐడీ అని, గ‌త ద‌శాబ్ధ కాలంలో వంద కోట్ల మంది భార‌తీయులు త‌మ గుర్తింపును ఆ కార్డుతో వెయ్యి కోట్ల సార్లు చూపించుకున్న‌ట్లు యూఐడీఏఐ ఒక ప్ర‌ట‌క‌న‌లో తెలిపింది.మూడీస్ ఇచ్చిన డేటాతో తాము ఏకీభ‌వించ‌డం లేద‌ని యూఐడీఏఐ పేర్కొన్న‌ది. ఆధార్ డేటాబేస్‌లో ఎటువంటి ఉల్లంఘ‌న జ‌ర‌గ‌లేద‌ని ఇటీవ‌ల పార్ల‌మెంట్‌లో కూడా పేర్కొన్న‌ట్లు యూఐడీఏఐ తెలిపింది.

అంత‌ర్జాతీయ సెక్యూర్టీ, ప్రైవ‌సీ ప్ర‌మాణాల ప్ర‌కార‌మే ఆధార్‌ను జారీ చేస్తున్న‌ట్లు తెలిపారు.ఐఎంఎఫ్‌, వ‌ర‌ల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు ఆధార్ వ్య‌వ‌స్థ‌ను మెచ్చుకున్నాయ‌ని యూఐడీఏఐ పేర్కొన్న‌ది. అనేక దేశాలు ఆధార్ శైలిలో త‌మ ఐడీల‌ను రూపొందించుకున్న‌ట్లు యూఐడీఏఐ తెలిపింది.

Here's UIDAI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)