Hyderabad, Mar 5: తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ (PM Modi) మంగళవారం సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళీ అమ్మవారిని (Ujjain Mahankali Temple) దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. తొలుత ఆలయం వద్దకు చేరుకున్న ప్రధానికి అర్చకులు, వేదపండితులు ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు ఆయనకు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. మహంకాళి అమ్మవారి దర్శనం తర్వాత సంగారెడ్డి పర్యటనకు మోదీ బయల్దేరారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో వెళ్లారు.
సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ pic.twitter.com/J5RodmpfrC
— Telugu Scribe (@TeluguScribe) March 5, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)