బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా అమెజాన్ అడవుల్లో నివసించే అరుదైన తెగకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. పెరువియన్ అమెజాన్‌లో సంచరిస్తున్న మాష్కో పైరో అనే తెగకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సర్వైవల్ ఇంటర్నేషనల్ అనే స్వదేశీ హక్కుల అడ్వకసీ గ్రూప్ విడుదల చేసింది. పెరు సమీపంలోని Las Piedras River లాస్ పీడ్రాస్ నదికి సమీపంలో వీరు సంచరిస్తూ కనిపించారు. ఈ ప్రాంతంలో మాష్కో పైరోలు సంచరిస్తున్నారని చెప్పేందుకు ఇది తిరుగులేని సాక్ష్యమని స్థానిక దేశీయ సంస్థ పెనామడ్ అధ్యక్షుడు ఆల్ఫ్రెడో వర్గాస్ పియో తెలిపారు. ఇంటర్నెట్ రాగానే పోర్న్‌కు బానిసలైన రిమోట్ అమెజాన్ తెగ యువకులు, తలలు పట్టుకుంటున్న మారుబో తెగ పెద్దలు
ఈ ప్రాంతాన్ని పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమవడమే కాకుండా లాంగింగ్ కంపెనీలకు ఈ ప్రాంతాన్ని విక్రయించిందని ఆయన ఆరోపించారు. మారుమూల గ్రామాలైన మోంటే సాల్వడో, ప్యూర్టో న్యూవో సమీపంలో ఈ తెగ ఆహారం కోసం అన్వేషిస్తూ ఇలా కెమెరా కంటికి చిక్కింది. ఈ తెగవారు బయటకు రావడంతో స్థానికులకు, వారికి మధ్య పోరాటాలు జరిగే అవకాశం ఉందని పియో ఆందోళన వ్యక్తం చేశారు.
Here's Video
Extraordinary new footage shows an Indigenous tribe, who are completely isolated from the outside world, on a riverbank in the Peruvian Amazon.
The Mashco Piro are the largest uncontacted Indigenous people in the world, but their lives and land are under serious threat due to… pic.twitter.com/gdNQM7AhKi
— 9News Australia (@9NewsAUS) July 18, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)