దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ కు కార్మికులు భారీ షాక్ ఇచ్చారు. సౌత్ కొరియాలో అతిపెద్ద యూనియన్ అయిన శాంసంగ్ వర్కర్ల యూనియన్ నేటి నుంచి మూడు రోజుల వాకౌట్‌కు వెళ్తోంది. జీతం సెలవుల సమయంపై గత నెలలో జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మెకు యూనియన్ పిలుపునిచ్చింది. శాంసంగ్ అర్ధ శతాబ్దపు చరిత్రలో ఈ స్థాయిలో సమ్మెకు వెళ్లడం ఇదే తొలిసారి. అత్యంత అధునాతన చిప్‌లు తయారుచేసే వాటిలో ఒకటైన ఇక్కడి ప్లాంట్ ఉత్పత్తికి అంతరాయం కలిగించడమే ఈ సమ్మె లక్ష్యమని యూనియన్ నాయకులు చెబుతున్నారు. డార్క్ వెబ్‌లో 50 వేల డాలర్లకు ఎయిర్‌టెల్ డేటా అమ్మకం, కంపెనీ స్పందన ఏంటంటే..
రాజధాని సియోల్‌కు 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న హ్వాసోంగ్‌లోని సెమీ కండక్టర్ ప్లాంట్ల బయట దాదాపు 5 వేల మందితో ర్యాలీ నిర్వహించాలని యూనియన్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ ర్యాలీకి ఎంతమంది హాజరవుతారన్న విషయంలో స్పష్టత లేదని యూనియన్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ లీ హ్యున్-కుక్ తెలిపారు. ఈ సమ్మె కారణంగా శాంసంగ్ పేరు ప్రతిష్ఠలు దెబ్బతినే అవకాశం ఉందని చెబుతున్నారు.
Here's News
Samsung workers are expected to walk off assembly lines Monday, beginning the biggest organized labor action in the South Korean conglomerate’s half-century history https://t.co/N7IhrIL3Yt
— Bloomberg Markets (@markets) July 7, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)