Spelling Mistake in Ram Mandir Inauguration Invitation Card: అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం అయింది. అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం జనవరి 22, 2024న మధ్యాహ్నం 12:20 గంటలకు జరగనుంది. 1,500-1,600 మంది "ప్రముఖ" అతిథులతో సహా దాదాపు 8,000 మంది ఆహ్వానితుల భాగస్వామ్యానికి సాక్ష్యంగా రామ మందిరం కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.

ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ , ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ , ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భగవత్ ప్రసంగించనున్నారు. ఈ మేరకు అందరికీ అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం ఆహ్వాన పత్రికలు వెళ్ళాయి. ఇదిలా ఉంటే ఆహ్వాన పత్రికలో సెల్పింగ్ మిస్టేక్ పడింది. దీన్ని నెటిజన్లు భారీగా ట్రోల్ చేస్తున్నారు. Invitation కు బదులుగా Invitaion అని పడింది. ఇందులో T మిస్ కావడంతో నెటిజన్లు దీన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. రామ్ మందిర్ ఇన్విటేషన్ కార్డ్ వీడియో ఇదిగో, శ్రీరాముని ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆహ్వానాలు పంపుతున్న ట్రస్ట్

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)