భారీ వర్షాలతో తమిళనాడు వణికిపోతోంది. జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. ప్రజలు నిర్భంధంలో చిక్కుకుని బిక్కుబిక్కుమంటున్నారు. భారీ వర్షాలతో జలమయమైన చెన్నై నగరంలోని టీపీ చత్రం ప్రాంతంలో ఓ అభాగ్యుడు అపస్మారక స్థితిలో ఉండగా, రాజేశ్వరి అనే లేడీ ఎస్సై అతనిని స్వయంగా తన భుజాలపై వేసుకుని మోశారు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రోడ్డు పక్కన విరిగిపడిన చెట్ల కొమ్మల మధ్య ఓ వ్యక్తి పడివున్నట్టు సమాచారం అందుకున్న ఆమె వెంటనే స్పందించారు. హుటాహుటీన అక్కడికి చేరుకుని చెట్ల కొమ్మలను తొలగించి, ఆ వ్యక్తిని కాపాడారు. అతడిని ఆటో వరకు మోసుకొచ్చారు. స్థానికుల సహకారంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. లేడీ ఎస్సై మానవతా దృక్పథానికి నెటిజన్లు హ్యాట్సాఫ్ అంటున్నారు. దీనిపై నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. మహిళా పోలీస్‌ ధైర్యసాహసాలను మెచ్చుకుంటున్నారు. ‘మీ సేవతో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. హ్యాట్సాఫ్‌ మేడమ్‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)