అమెరికాలో 19 అడుగుల పొడవు గల భారీ పైథాన్‌ను ఓ యువకుడు పట్టుకున్నాడు. దీని బరువు 56.6 కేజీలు ఉంది. ఫ్లోరిడాలో ఓహియో యూనివర్శిటీకి చెందిన ఓ యువకుడు(22) దీన్ని సాహసంతో పట్టుకున్నాడు. అనంతరం అటవీ అధికారులకు అప్పగించారు.యువకులు రోడ్డుపై వెళుతుండగా.. ఓ పెద్ద పైథాన్ వారిని అడ్డగించింది. భయపడిన యువకులు కాసేపు తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇక లాభం లేకపోవడంతో ఓ యువకుడు దాన్ని పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే అతని స్నేహితులు కూడా సహాయం చేయగా.. అందరూ కలిసి దాన్ని పట్టుకున్నారు. పైథాన్‌ను పట్టుకునే క్రమంలో ఆ యువకుడు పెద్ద యుద్దమే చేశాడు. కిందపడినప్పటికీ దాని తలను మాత్రం వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా.. తెగ వైరల్‌గా మారింది.
Here's Video
View this post on Instagram
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)