తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొన్ని రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో కూడా నాలుగైదు రోజుల నుంచి ముసురు కమ్ముకుంది. ఇలాంటి పరిస్థితుల్లో జీహెచ్ ఎంసీ సిబ్బంది మొక్కలకు నీళ్లు పోస్తూ కనిపించారు. జోరు వానలో ఓ ఫ్లై ఓవర్ పక్కన ఉన్న చెట్లూ, మొక్కలకు నీళ్లు పోస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

జీహెఎంసీ వాటర్ ట్యాంక్ తో ఇద్దరు సిబ్బంది చెట్లకు నీళ్లు పడుతుండగా.. ఓ వ్యక్తి వారిని ప్రశ్నించాడు. ఓ వైపు వర్షం పడుతుండగా నీళ్లు పట్టాల్సిన అవసరం ఏముందని అతను ప్రశ్నించగా.. సిబ్బంది సరైన సమాధానం చెప్పలేకపోయారు. ఈ వీడియోను పలువురు ప్రముఖ జర్నలిస్టులు సోషల్ మీడియాలో షేర్ చేసి జీహెచ్ఎంసీ తీరును ఆక్షేపించారు. ప్రజాధనం ఇలా దుర్వినియోగం చేస్తున్న జీహెచ్ ఎంసీ తీరుపై విమర్శలు వస్తున్నాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)