Newdelhi, March 12: ఢిల్లీలో (Delhi) జరిగిన హోలీ వేడుకల్లో (Holi Celebrations) జపాన్‍కు (Japan) చెందిన ఓ యువతి.. వేధింపులకు గురయ్యారు. ముగ్గురు యువకులు ఆమెను వేధించారు. ఢిల్లీలోని పహర్‌గంజ్‍లో బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవటంతో ఆ యువతి స్పందించారు. ఘటనను వివరిస్తూ శనివారం ట్వీట్లు చేశారు. నిజమైన హోలీ.. ఎంతో సరదాగా ఉండే పండుగ అని, తనకు భారత దేశమంటే చాలా ప్రేమ అని తెలిపారు. “అన్ని విషయాల్లో ఇండియాను నేను ఎంతో ప్రేమిస్తా. ఇండియాకు చాలా సార్లు వచ్చా. ఇదో అద్భుతమైన దేశం. ఇలాంటి ఘటన జరిగినా ఇండియాపై ద్వేషం కలగదు” అని ఆమె ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

మళ్లీ మొదలైన ఆందోళన.. పెరుగుతున్న కొవిడ్, హెచ్3ఎన్2 కేసులు.. అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలకు కేంద్రం లేఖ.. మెడికల్ ఆక్సిజన్, టీకాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచన

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)