టర్కీలో తుఫాను (Storm) బీభత్సానికి ఓ ఇంట్లో ఉన్న సోఫా అమాంతం ఆకాశంలోకి ఎగిరిపోయింది. బలమైన గాలుల ధాటికి కొద్దిదూరం ఎగురుకుంటూ వెళ్లి ఓ భవనానికి బలంగా తాకింది. ఫిబ్రవరిలో భూకంపంతో విలవిల్లాడిన టర్కీ ఇప్పుడు భారీ వర్షాలు, ఈదురుగాలులతో వణికిపోతున్నది. దేశ రాజధాని అంకారాలో (Ankara) ఈదురు గాలుల ధాటికి ఏకంగా సోఫాను కొట్టుకుపోయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ షేర్‌ అవుతున్నది. సోఫా గాలిలో ఎగురుకుంటూ వస్తున్న వీడియో ఫుటేజీని గురు ఆఫ్‌ నథింగ్‌ (Guru of Nothing) అనే ఖాతాదారుడు ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. అంకారాలో కురిసిన తుఫాను వల్ల పలు సోఫాలు గాలిలో ఎగిరిపోతున్నాయంటూ రాసుకొచ్చాడు.

Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)