ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగిన కలకలం రేపిన సంఘటనలో హెడ్ కానిస్టేబుల్ బ్రిజ్ కిషోర్ హీట్ వేవ్ దెబ్బకు సొమ్ముసిల్లిపడిపోయాడు. అయితే అతన్ని ఆస్పత్రికి తీసుకువెళ్లకుండా ఇన్‌స్పెక్టర్ అతన్ని వీడియో తీస్తున్నాడు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. సహాయం చేయకుండా ఇలా వీడియో తీసుకుంటారా.. మీరేం పోలీసులు అని మండిపడుతున్నారు. రీల్స్ పిచ్చి ఎంత ముదిరిందో వీడియోలో చూడండి, పాడుబడిన భవనంపై నుండి వేలాడుతూ స్టంట్
హెడ్ కానిస్టేబుల్ బ్రిజ్ కిషోర్ సింగ్ ఇంటికి వెళుతుండగా, పోలీస్ లైన్ స్టేషన్ వెలుపల కుప్పకూలినప్పుడు ఈ సంఘటన జరిగింది. తక్షణ వైద్య సహాయం కాకుండా, ఒక సబ్-ఇన్‌స్పెక్టర్ సింగ్ పరిస్థితిని వీడియోలో రికార్డ్ చేయడం చూడవచ్చు. కీలకమైన క్షణాలు జారిపోవడంతో కానిస్టేబుల్ అపస్మారక స్థితిలో పడి ఉన్న దృశ్యాలు ఫుటేజీలో ఉన్నాయి. దురదృష్టవశాత్తూ, అతన్ని ఆస్పత్రికి లేటుగా తీసుకువెళ్లడం వల్ల చికిత్స సమయంలోనే మరణించాడు. సకాలంలో వైద్య సహాయం అంది ఉంటే బతికేవాడు.
Here's Video
देखिए लोग कितने निर्दयी हो गए हैं
कानपुर में गर्मी के कारण सिपाही की जान जा रही थी तभी दरोगा अस्पताल ले जाने की जगह मोबाइल पर वीडियो बनाने में लगे थे !
बाद में सिपाही की जान चली गई pic.twitter.com/sE6xFV08po
— Nigar Parveen (@NigarNawab) June 18, 2024
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)