యూపీలోని ఓ ఆటో రిక్షా 7 సీట‌ర్‌లో ఏకంగా 27 మంది కూర్చొని ఉండ‌గా, ఓవ‌ర్‌స్పీడ్‌తో ప్ర‌యాణిస్తున్న ఆటోను ఆపి చూసిన పోలీసుల‌కు మ‌తిపోయింది. ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.ఫతేపూర్‌లోని బింద్‌కీ కొత్వాలి ప్రాంతంలో ఈ ఆటో కనిపించింది. ఇందులో కేవ‌లం ఏడురుగు మాత్ర‌మే ప్రయాణించే సామర్థ్యం ఉండగా.. ఆ డ్రైవర్ వృద్ధులు, చిన్నారులు సహా 27 మందిని ఎక్కించాడు. అంగుళంకూడా గ్యాప్ లేకుండా అంద‌రూ ఇరికిరుకుగా కూర్చున్నారు. పోలీసులు వారంద‌రినీ కిందికి దించి లెక్కించారు. అనంత‌రం డ్రైవ‌ర్‌పై కేసు న‌మోదు చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)