అయోధ్యలో ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు గుడి కట్టి రాముడిగా పూజిస్తున్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయోధ్య జిల్లా భరత్ కుండ్ ప్రాంతంలోని పూర్వా గ్రామానికి చెందిన ప్రభాకర్ మౌర్య అనే ఆధ్యాత్మిక గాయకుడు యోగి ఆదిత్యనాథ్ కు రాముడిగా గుడిని ఇటీవలే ప్రారంభించారు. అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయానికి ఇది సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

కుడిచేతిలో విల్లు, వెనుక బాణాలు, తల వెనుక సూర్యుడి చిత్రంతో నడుచుకుంటూ వస్తున్నట్టుగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ విగ్రహాన్ని ఆలయంలో ఓ గోడపై చెక్కినట్టుగా ప్రతిష్టించారు.30 ఏళ్ల కిందట వచ్చిన రామాయణం సీరియల్ లోని రాముడి తరహాలో యోగి ఆదిత్యనాథ్ ముఖ కవళికలతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ రోజూ పూజలు కూడా చేస్తున్నారు.

కాగా అయోధ్యలో రామాలయం నిర్మాణం కావాలన్నది తన కల అని, రాముడి గుడి ఎవరు కట్టిస్తే వారికి గుడి కట్టి పూజ చేస్తానని 2015లో శపథం చేశానని ప్రభాకర్ మౌర్య తెలిపారు. ఆ కలను నెరవేరుస్తున్న యోగి ఆదిత్యనాథ్ కూడా రాముడేనని పేర్కొన్నారు.ఈ ఆలయం కట్టడానికి సుమారు రూ.8.5 లక్షలు ఖర్చు అయిందని, రాజస్థాన్ లో విగ్రహాన్ని తయారు చేయించి తెచ్చి ప్రతిష్టించానని ప్రభాకర్ మౌర్య వెల్లడించారు.ఇంతకుముందు మహారాష్ట్రలోని పూణె సమీపంలో మయూర్ ముండే అనే వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీకి గుడి కట్టించారు. దానిని గత ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం రోజున తెరిచి పూజలు కూడా ప్రారంభించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)