ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ రోషనాబాద్‌లోని జిల్లా సెషన్స్ కోర్టులోకి ప్రవేశించిన అడవి ఏనుగు అలజడి సృష్టించింది. గేటును ఢీకొట్టి కోర్టు ప్రాంగణంలోకి ఏనుగు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రాజాజీ టైగర్ రిజర్వ్ నుండి బయటికి వచ్చిన అడవి ఏనుగు.. జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయంలోకి చొరబడింది. కోర్టు ఆవరణలో తిరుగుతూ గందరగోళం సృష్టించింది. కోర్టు గేట్లను తోసేసి గోడను కూడా ధ్వంసం చేసిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఏనుగు కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించే ముందు కోర్టు ప్రధాన గేటును అమాంతం పక్కకు తోసేసిన దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. అటవీ అధికారులకు సమాచారం అందించడంతో అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలానికి వచ్చి ఆ ఏనుగును అడవిలోకి తరలించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)