బెంగళూరు నగరంలో నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల వర్షం కురిసింది. కేఆర్ మార్కెట్ వద్ద సిర్సి సర్కిల్ ఫ్లై ఓవర్ పైనుంచి ఓ వ్యక్తి కరెన్సీ నోట్లు జనంపైకి విసిరేశాడు. ఆ నోట్లను అందుకునేందుకు ప్రజలు పోటీలు పడ్డారు. వాహనాలు ఆపి మరీ రోడ్డుపై నోట్ల వేట సాగించారు. దాంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
నోట్లు విసిరిన వ్యక్తి సూటుబూటు ధరించి మెడలో ఓ గోడ గడియారాన్ని తగిలించుకుని విచిత్ర వేషధారణతో కనిపించాడు. చేతి సంచి నిండా ఉన్న కరెన్సీ నోట్లను ఫ్లై ఓవర్ పైనుంచి వెదజల్లుతూ అందరి దృష్టిని ఆకర్షించాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా, ఆ వ్యక్తి వెదజల్లింది రూ.10 నోట్లు అని తెలుస్తోంది. అయితే ఇలా ఎందుకు చేశాడనేది ఇంకా తెలియరాలేదు.
Here's Video
#Watch: A man throws currency notes from a flyover at the busy KR Market has gone viral #Bengaluru #Bengalurunews #NammaBengaluuru #viralvideo pic.twitter.com/w49OSG7H3O
— Bangalore Times (@BangaloreTimes1) January 24, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)