Women Passengers Fight in Local Train: కోల్‌కతా లోకల్ రైలులో కొందరు మహిళలు జుట్టు పట్టుకొని ఒకరిపై ఒకరు చెప్పులతో దాడి చేసుకున్నారు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయుషి అనే మహిళ కోల్‌కతా లోకల్ పేరుతో ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేశారు. జులై 11న ఈ వీడియో పోస్ట్ చేయగా, దాదాపు 50వేల మంది నెటిజన్లు వీక్షించారు.

ఈ వీడియో ప్రకారం ఇద్దరు మహిళలు ఒకవైపు ఉండగా, మిగిలిన వారు మరోవైపు ఉన్నట్లుగా ఉంది. లోకల్ రైలులోని లేడీస్ కంపార్టుమెంట్ లో మహిళలు గొడవ పడుతున్నట్లుగా ఈ వీడియోలో ఉంది. ఆ మహిళలు అరవడం, కేకలు వేయడం.. ఒకరిపై మరొకరు చెప్పులతో, పిడికిలి బిగించి కొట్టుకోవడం ఆ వీడియోలో ఉంది. ఒకరి జుట్టును మరొకరు లాగుతున్నట్లుగా కూడా వీడియోలో ఉంది.

Women Passengers Fight in Local Train

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)