అసోం రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి ఓ స్కూటర్ కొనుగోలు చేశాడు. అయితే అతడు స్కూటర్ కొనుగోలు చేసింది కరెన్సీ నోట్లతో, ఆన్‌లైన్ పేమెంట్‌తో కాదు. ఓ బస్తా నిండా చిల్లర నాణేలు వేసుకుని వెళ్లి షోరూంలో తనకు నచ్చిన స్కూటర్ కొనుగోలు చేశాడు. ఆ వ్యక్తి ఓ స్టేషనరీ దుకాణదారు. కొత్త స్కూటర్ కొనడం కోసం 8 నెలలుగా చిల్లర పోగు చేశాడట.

ఆ చిల్లర లెక్కించేందుకు షోరూం సిబ్బంది కాస్త శ్రమపడాల్సి వచ్చింది. ఇతర పనులన్నీ మానుకుని ప్లాస్టిక్ ట్రేలలో వేసుకుని ఆ చిల్లర నాణేలు లెక్కించారు. ఎలాగైతేనేం... ఆ వ్యక్తి స్కూటర్ కొనుగోలు చేశాడు. ఈ కొనుగోలు లావాదేవీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)