న్యూయార్క్ నగరంలో ఎలుకలు పట్టే ఉద్యోగికి అక్షరాల రూ.1.2కోట్లు జీతం అంటే నమ్మగలరా..ఈ మధ్య న్యూయర్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ‘ర్యాట్ క్యాచర్’ను నియమించారు. క్యాచర్స్‌కు వేతనం అక్షరాలా రూ.1.2కోట్లు ఇస్తుండడం విశేషం. ‘డైరెక్టర్ ఆఫ్ రోడెంట్ మిటిగేషన్’ పేరుతో ఎలుకలను నియంత్రించే ఉద్యోగానికి దరఖాస్తులను మేయర్ ఆహ్వానించారు. ఇప్పటి వరకు 900 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో కేథలిన్ కొరాడీని ఎంపిక చేశారు. ఓ స్కూల్‌లో ఆమె టీచర్‌గా పని చేస్తుంటారు.
విద్యాశాఖలో ఎలుకల నియంత్రణ.. వాటికి ఆహారం.. నీళ్లు అందకుండా చూడడం అంశాలపై రీసెర్చ్ చేశారు.ఈ ఉద్యోగంలో భాగంగా ఆమె ఇళ్లలో మిగిలిపోయే ఆహారం.. చెత్తను ఎలకలకు దొరకుండా డిస్పోస్ చేయడం, ఎలుకల సంతతి తగ్గేలా చర్యలు తీసుకోవడం, సబ్‌వేలలో ఎలుకలు ఆవాసాలు ఏర్పాటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
Here's News
Rats, meet your worst nightmare.
Kathleen Corradi is our Rat Czar, and she hates rats as much as I do. pic.twitter.com/laZOMm2QeA
— Mayor Eric Adams (@NYCMayor) April 13, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)