గుజరాత్ లోని వడోదరలో మోటర్ సైకిల్ పై తన ఒడిలో ప్రియురాలిని కూర్చోబెట్టుకుని ఓ యువకుడు రోమాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. తనకు కాబోయే భర్త బైక్ మీద ఆ యువతి శృంగార క్షణాలు అనుభవిస్తుండగా ఎవరో వీడియో తీసారు. ఈ వీడియో కాస్తా పోలీసులకు చేరడంతో ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియోలో నటులు అమీర్ ఖాన్, రాణీ ముఖర్జీ నటించిన గులాం సినిమాలోని ఓ పాట సన్నివేశాన్ని గుర్తు చేసింది.

వీడియో అందుకున్న హర్ని పోలీస్ స్టేషన్ అధికారులు విచారణ ప్రారంభించారు. వీడియోలో మోటర్ సైకిల్ రిజిస్ట్రేషన్ నంబర్ స్పష్టంగా ఉండటంతో ఆ నంబర్ ఉపయోగించి దాని యజమానిని ట్రాక్ చేశారు.మోటర్ సైకిల్ న్యూ వీఐపీ రోడ్డులోని సొసైటీలో ఉంటున్న కల్పేష్ దర్బార్ కు చెందినదిగా గుర్తించారు. మోటార్ సైకిల్ నడిపింది అతనేనని నిర్థారణకు వచ్చారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)