టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి లండన్ వీధుల్లో ప్రత్యక్షమయ్యాడు. శ్రీలంకతో వన్డే సిరీస్ అనంతరం కోహ్లి తన భార్య పిల్లలను కలిసేందుకు లండన్‌కు పయనమయ్యాడు. ఈ క్రమంలో లండన్ వీధుల్లో కోహ్లి తిరుగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది.బ్లాక్ డ్రెస్ వేసుకున్న కోహ్లి రోడ్డును దాటుతున్నట్లు ఈ వీడియోలో కన్పించింది.
విరుష్క జంట లండన్‌లో ఓ లిస్టెడ్ కంపెనీ కలిగి ఉంది. మ్యాజిక్ ల్యాంప్ డైరెక్టర్లుగా విరాట్ కోహ్లి, అనుష్క శర్మలు ఉన్నారు. ఈ క్రమంలోనే విరాట్-అనుష్క లండన్‌లో స్ధిరనివాసం ఏర్పరుచుకోనున్నారని ప్రచారం జరగుతోంది. ఇక శ్రీలంతో వన్డే సిరీస్ అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న కోహ్లి.. బంగ్లాతో టెస్టు సిరీస్‌కు అందుబాటులోకి రానున్నాడు.
Here's Video
Virat Kohli Spotted On The Street Of London Today! 🚶♂️👑❤️#ViratKohli #London @imVkohli pic.twitter.com/8r05QU3AyC
— virat_kohli_18_club (@KohliSensation) August 14, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)