విదేశీ ప్రయాణికుడు ఒకరు పెద్ద మొత్తంలో అమెరికా డాలర్లను అక్రమంగా తీసుకొస్తూ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడ్డాడు. తన వెంట తెచ్చిన పుస్తకాలలోని పేజీల మధ్య అత్యంత జాగ్రత్తగా కరెన్సీ నోట్లను దాచాడు. ఆ పుస్తకాలను తిరగేస్తే దాదాపు ప్రతీ రెండు మూడు పేజీలకు ఓ కరెన్సీ నోటు కనిపించింది. ఇలా ఆ ప్రయాణికుడు తీసుకొచ్చిన నోట్ల విలువ 90 వేల డాలర్లు అని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. సదరు ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ తనిఖీలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)