ప్రమాదం ఏ వైపు నుంచి వస్తుందో ఎవరూ చెప్పలేరు. తాజాగా ఓ మహిళకు కూడా ఇలాంటి ఓ భయంకర సంఘటనే ఎదురైంది. మలేషియాలో తన స్నేహితురాలితో కలిసి మహిళ తేలుక్ కుంబార్ నుంచి జార్జ్ టౌన్ వైపు వెళుతోంది. అయితే రహదారి పక్కన కొన్ని కొబ్బరి చెట్లు రోడ్డుపైకి వంగి ఉన్నాయి. ఇంతలో ఒక కొబ్బరి చెట్టుపై నుంచి బాస్కెట్ బాల్ సైజులో ఉన్న కొబ్బరికాయ స్కూటర్‌పై వెనుక కూర్చొన్న మహిళ తలపై నేరుగా పడింది. దీంతో మహిళ ఒక్కసారిగా స్కూటర్‌ పై నుంచి రోడ్డుపై పడిపోయింది. అయితే మహిళ హెల్మెట్‌ ధరించి ఉండటంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. వెంటనే స్కూటర్‌పై ఉన్న స్నేహితురాలు, స్థానికులు అప్రమాత్తమయ్యారు. రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఆపి బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. కాగా టూవీలర్‌ వెనకాల వెళ్తున్న కారు డ్యాష్‌ బోర్డుపై ఉన్న కెమెరాలో రికార్డైన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా వైరల్‌గా మారాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)