ఒక చిన్న విషయానికి వధూవరులు గొడవపడి ఒకరినొకరు కొట్టుకున్న వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వధూవరులు వేదికపై నిల్చుని ఫోటోకు పోజిలిస్తున్నారు. దండలు మార్చుకున్న అనంతరం.. వధువు ప్రేమతో వరుడికి స్వీట్ తినిపించాలని చూస్తుంది. వరుడు మాత్రం ఫోటోకు పోజులిస్తుంటాడు. చాలాసేపు వరుడు ఫొటోలకు పోజులివ్వడంతో వధువుకు ఓపిక నశిస్తుంది. దాంతో చేతిలో ఉన్న స్వీటును వరుడు ముఖానికేసి కొడుతుంది వధువు.

స్టేజ్‌పైనే వధువు కొట్టడంతో వరుడికి చిర్రెత్తుకొస్తుంది. ఆవేశంలో వధువు చెంప చెళ్లుమనిపిస్తాడు. వధువు కూడా తగ్గేదేలే అంటూ.. వరుడిని ఒకటి పీకుతుంది. ఆపై ఒకరినొకరు పొట్టుపొట్టుగా కొట్టుకుంటారు. ఇది చుసిన స్టేజ్‌పైన ఉన్నవారు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)