Newdelhi, March 12: ఇండోనేసియాలోని (Indonesia) జావా ద్వీపంలో (Java Island) ఉన్న మెరాపి అగ్నిపర్వతం (Merapi Volcano) బద్దలైంది. పరిసర ప్రాంతాల్లో పొగతో కూడిన మేఘాలు అలముకున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో పర్యాటకం, మైనింగ్ కార్యకలాపాలను అధికారులు నిలిపివేశారు. పొగ మేఘాల ధాటికి దాదాపు 7కి.మీ. వరకు సూర్య రశ్మి లేక చీకటి అలముకుందని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. అగ్నిపర్వతం నుంచి 1.5కి.మీ. వరకు లావా ప్రవహించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 2010లో ఇదే మెరాపి అగ్నిప్రమాదం బద్దలై 347 మంది మరణించారు.
ఇండియాపై ప్రేమ పోదు.. హోలీ వేడుకల్లో వేధింపులకు గురైన జపాన్ యువతి ట్వీట్లు.. వైరల్
Video kejadian awanpanas guguran di #Merapi tanggal 11 Maret 2023 pukul 12.12 WIB dari stasiun CCTV Tunggularum-Sleman. Masyarakat diimbau untuk menjauhi daerah bahaya (jarak 7 km dari puncak Gunung Merapi di alur Kali Bebeng dan Krasak). pic.twitter.com/obgdVSKzk3
— BPPTKG (@BPPTKG) March 11, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)