తమిళనాడులో కడలూరు జిల్లా చిదంబరంలో బస్టాప్ లో జరిగిన ఓ పెళ్లి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో బస్టాండ్ వద్ద పాఠశాల యూనిఫాంలో ఉన్న ప్లస్ టు చదువుతున్న విద్యార్థిని మెడలో పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న విద్యార్థి తాళి కట్టాడు. సహచర విద్యార్థులు వారిపై అక్షింతలు వేసి శుభాకాంక్షలు తెలిపారు.

బస్టాండ్‌లో అమ్మాయి కూర్చుని ఉండగా అబ్బాయి తాళి కడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అది కాస్తా పోలీసుల దృష్టికి చేరింది. దీంతో వారు విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. బాలల సంక్షేమ అధికారి రమ్య నేతృత్వంలో ఈ ఘటనపై అధికారుల బృందం విచారణ జరుపుతోంది. కాగా, విద్యార్థుల పెళ్లి వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన బాలాజీ గణేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)