Kharagpur, Dec 9: ఏ నిమిషానికి ఏమి జరుగునో.. ఎవరు ఊహించగలరు.. అని అన్నట్టు కొన్ని ఘటనలు చూస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఇలాంటి ఓ ఘటనే పశ్చిమ బెంగాల్‌లోని (West Bengal) ఖరగ్‌పూర్ (Kharagpur) రైల్వే స్టేషన్‌లో (Railway Station) జరిగింది. ప్లాట్‌ఫామ్‌పై మరో వ్యక్తితో నిల్చుని మాట్లాడుతున్న టీటీఈ (TTE) తలపై హైటెన్షన్ వైర్ (ఓహెచ్ఈ వైరు) తెగిపడింది. అది పడిన మరుక్షణమే ఆయన అలాగే ఒరిగిపోయి రైల్వే ట్రాక్‌పై (Railway Track) పడిపోయాడు. అతడితో మాట్లాడుతున్న వ్యక్తి త్రుటిలో తప్పించుకున్నాడు. అందరూ చూస్తుండగానే ఈ విషాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

18-25 ఏండ్ల యువతకు కండోమ్స్ ఫ్రీ... ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ సంచలన నిర్ణయం

బాధిత టీటీఈని సుజన్ సింగ్ సర్దార్‌గా గుర్తించారు. ప్రస్తుతం ఆయనకు దవాఖానలో చికిత్స కొనసాగుతోంది. బహుశా పక్షుల వల్లే వైర్ తెగిపోయి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)