పంజాబ్‌లోని బెహ్రామ్ వద్ద ఓ భారీ ట్రక్ అదుపుతప్పి బోల్తా పడటంతో కారు దారుణంగా ధ్యంసంమైంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. 18 చక్రాల భారీ ట్రక్ మితిమీరిన వేగంతో రహదారిపై వస్తూ.. అకస్మాత్తుగా మలుపు తీసుకోవడంతో ఒక్కసారిగా బ్యాలెన్స్ కోల్పోయి బోల్తా పడింది. అదే సమయంలో ఆ రహదారిపై రెండు వాహనాలు వస్తున్నాయి.
ఐతే ఒక కారు కొద్దిలో తప్పించుకుంటే మరో వాహానం ఈ ట్రక్ కింద పడి నుజ్జునుజ్జు అయిపోయిది. ఈ ప్రమాదంలో ఒక జంట వారి కొడుకు అక్కడికక్కడే చనిపోగా మరొకరు తీవ్రగాయాల పాలయ్యారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీఫుటేజ్‌లో రికార్డు అవ్వడంతో వెలుగు చేసింది.పోలీసులు తన ర్యాష్ డ్రైవింగ్‌తో ఈ ప్రమాదానికి కారకుడైన ట్రక్ డ్రైవర్ మేజర్‌సింగ్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
#Punjab - Three people were killed in a road accident near Behram on #Phagwara-Banga road. 🥺 #Punjab #accident pic.twitter.com/UreDU2ou9W
— Harish Deshmukh (@DeshmukhHarish9) September 13, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)