సోషల్ మీడియాలో షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో స్టేషన్‌కు ముందే నిలిపేసిన ట్రైన్‌ నుంచి కొందరు ప్రయాణికులు దిగి వెళ్లేందుకు ప్రయత్నించారు. వీడియో తీస్తున్న వ్యక్తి పక్క ట్రాక్‌పై మరో ట్రైన్‌ వస్తుందని చెబుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ఓ కుటుంబ సభ్యుల్లో భయాందోళన నెలకొంది. పట్టాలకు అవతలివైపు తమ లగేజీని పడేసిన ఓ మహిళ మళ్లీ తిరిగి ఈ వైపునకు వచ్చే ప్రయత్నం చేసింది. రెప్పపాటులో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఐఏఎస్‌ అధికారి అవనీశ్‌ శరన్ ఈ దృశ్యాలను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు.‘ఈ జీవితం మీది.. నిర్ణయమూ మీదే’ అని క్యాప్షన్‌ ఇచ్చారు.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)