అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమాలోని 'పుష్ప.. పుష్పరాజ్.. త‌గ్గేదే లే' డైలాగు ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా మారుమోగిపోతూనే ఉంది. తాజాగా ఓ విద్యార్థి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో జ‌వాబు ప‌త్రంలో 'పుష్ప.. పుష్పరాజ్.. జవాబులు రాసేదే లే' అని రాశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. ప‌శ్చిమ‌ బెంగాల్ లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ఇటీవ‌ల ముగిశాయి. ప్ర‌స్తుతం పేపర్లు దిద్దే ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. ఓ విద్యార్థికి సంబంధించిన‌ పేప‌ర్ దిద్దుతుండ‌గా ఓ ఉపాధ్యాయుడు అందులో 'పుష్ప' డైలాగ్ ఉండ‌డాన్ని చూసి షాక్ అయ్యారు. 'పుష్ప.. పుష్పరాజ్.. జవాబులు రాసేదే లే అంటూ ఆ విద్యార్థి రాశాడు. ఉపాధ్యాయుడు ఆ ఫొటో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ విద్యార్థి జ‌వాబు ప‌త్రాల్లో 'పుష్ప' డైలాగు త‌ప్ప‌ ఇంకేమీ రాయలేదని తెలుస్తోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)