కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైకు వింత అనుభవం ఎదురయింది. ముఖ్యమంత్రి తన ఇంటికి రావడంతో ఆనందం పట్టలేని ఓ మహిళ ఏకంగా సీఎం చేతిని అదేపనిగా ముద్దాడింది. దీంతో బొమ్మై ఒకింత అసహనానికి గురయ్యారు. జనసేవక కార్యక్రమంలో భాగంగా కర్ణాటక సీఎం బొమ్మై బెంగుళూరులోని గుట్టహళ్లిని సందర్శించారు.

ఈ సందర్భంగా ఓ మహిళ ఇంటి ముందుకు వెళ్లగా అక్కడున్న మహిళ సీఎంను చూసిన సంతోషంలో కుడిచేతిని పట్టుకుని పదే పదే ముద్దులు పెట్టింది. ఆమె ప్రవర్తనతో సీఎం ఇబ్బందికి గురయ్యారు. దీంతో పక్కనే ఉన్న మంత్రి అశ్వథ్ నారాయణ ఆమెను వారించారు. ఇలా చేయడం సరికాదంటూ తెలిపారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)