సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ యూట్యూబర్ (YouTuber) ఏకంగా వంద పచ్చి గుడ్లను ఒకేసారి తాగేశాడు.విన్స్‌ ఇయానోన్‌ (Vince Iannone) అనే యూట్యూబర్‌ తనకు 100K (లక్ష) ఫాలోవర్స్‌ వచ్చినందుకు గానూ ఈ సాహసం చేశాడు. జిమ్‌లో నిలబడి ఉన్న విన్స్‌.. ఓ పెద్ద మగ్గు నిండా పచ్చిగుడ్లను నింపుకున్నాడు. ఎందుకిలా చేస్తున్నాడో వివరిస్తూ.. మగ్‌లోని గుడ్డు మిశ్రమాన్ని తాగడం ప్రారంభిస్తాడు. సగం తాగేశాక కాస్త గ్యాప్‌ ఇచ్చి మళ్లీ కాస్త తాగుతాడు. సగానికిపైగా అయిపోయిన తర్వాత మగ్‌ను పక్కకు పెట్టి నాలుగు పుషప్స్‌ చేస్తాడు. ఆ తర్వాత మళ్లీ తాగడం కొనసాగిస్తాడు. అలా మొత్తం మగ్‌లోని గుడ్డు మిశ్రమాన్నంతా కంప్లీట్‌ చేసేస్తాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

YouTuber Drinks 100 Raw Eggs To Celebrate 100K Followers

Here's Video

 

View this post on Instagram

 

A post shared by Vince Iannone (@vince_aesthetic)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)