చైనాలోని హోంగ్జూ వేదికగా జరుగుతున్న ఆసియా పారా క్రీడల్లో అథ్లెట్‌ దిలీప్‌ మహదు గవిత్‌ పసిడి గెలిచి సెంచరీ మెడల్స్‌ లాంఛనం పూర్తి చేశాడు.దిలీప్ మహదు గవిత్ పురుషుల T47 400 మీటర్ల పరుగుపందెంలో స్వర్ణ పతకాన్ని సాధించాడు.అతను 49.48 సెకన్ల అద్భుతమైన రన్ టైమ్‌తో స్వర్ణం సాధించాడు. ఈ విజయంతో భారత్‌కు మొత్తం 26 స్వర్ణాలు వచ్చాయి.

ఆసియా పారా క్రీడల్లో భారత్‌ ఇప్పటి వరకు 29 పసిడి, 31 రజత, 51 కాంస్యాలతో 111 పతకాలు కైవసం చేసుకుంది. తద్వారా పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.చైనా అత్యధికంగా 214 స్వర్ణాలు, 167 వెండి, 140 కంచు పతకాలతో మొత్తంగా 521 మెడల్స్‌తో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. చైనా తర్వాత.. 131 పతకాలతో ఇరాన్‌ రెండో స్థానం ఆ‍క్రమించింది.

Dilip Mahadu Gavit Wins Gold Medal in Men's 400m T47 Event at Asian Para Games 2023

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)