ప్రపంచ కప్ ఫైనల్స్‌పై తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ (Rajinikanth) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ వంత శాతం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం భారత్‌ – న్యూజిలాండ్‌ మధ్య జరిగిన సెమీఫైన్సల్‌ మ్యాచ్‌ను రజినీకాంత్‌ వాంఖడే స్టేడియంలో స్వయంగా కుటుంబ సమేతంగా వీక్షించిన విషయం తెలిసిందే. అనంతరం చెన్నై చేరుకున్న సూపర్‌ స్టార్‌ మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఫైనల్స్‌లో భారత్‌ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ‘న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్స్‌ మ్యాచ్‌లో మొదట కాసేపు టెన్షన్‌ పడ్డాం. మొదటి గంటన్నర చాలా ఆందోళనకు గురయ్యాం. ఆ తర్వాత వరుసగా వికెట్లు పడిపోవడంతో గేమ్‌ మనకు అనుకూలంగా మారింది. ఈ సారి ప్రపంచకప్‌ మనదే. ఫైనల్స్‌లో వంద శాతం ఖచ్చితంగా భారత్‌ గెలుస్తుంది’ అని ధీమాగా చెప్పారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)