ఆఫ్ఘ‌నిస్థాన్( Afghanistan ) పేలుళ్ల‌పై ఆ దేశ స్టార్ క్రికెట‌ర్లు ర‌షీద్ ఖాన్‌, మ‌హ్మ‌ద్ న‌బీ ట్విటర్ ద్వారా స్పందించారు. ఈ దాడుల‌పై వాళ్లు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గురువారం సాయంత్రం జ‌రిగిన రెండు ఆత్మాహుతి దాడుల్లో వంద మందికిపైగా మ‌రణించిన విష‌యం తెలిసిందే. దీనిపై ర‌షీద్ ఖాన్ స్పందిస్తూ.. కాబూల్ మ‌ళ్లీ ర‌క్త‌మోడుతోంది. ఆఫ్ఘ‌న్ల‌ను ద‌య‌చేసి చంప‌డం ఆపండి అంటూ వేడుకున్నాడు. మ‌రోవైపు మ‌హ్మ‌ద్ న‌బీ కూడా ఈ ఘ‌ట‌న‌పై ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ ట్వీట్ చేశాడు. ఈ దాడుల‌ను ఖండించిన అత‌డు.. ఇలాంటి క‌ష్ట స‌మ‌యంలో ఆఫ్ఘ‌న్ల‌ను ఆదుకోవాల‌ని కోరాడు. త‌మ దేశాన్ని ఆదుకోవాలంటూ గతంలో కూడా ఒక‌సారి ర‌షీద్ ఖాన్ ట్విట‌ర్ ద్వారా ప్ర‌పంచ నేత‌ల‌ను వేడుకున్న విష‌యం తెలిసిందే.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)