సచిన్ టెండూల్కర్ ఎక్స్ ద్వారా ఒక ఆసక్తికర వీడియోను పంచుకున్నాడు. 'సచిన్ ఇవాళ టెండూల్కర్ ను కలిశాడు' అంటూ తన పోస్టుకు హెడ్డింగ్ పెట్టారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే... సచిన్ కారులో వెళుతుండగా, టెండూల్కర్ అనే పేరుతో ఉన్న నెం.10 ముంబయి ఇండియన్స్ జెర్సీని ధరించి బైక్ పై అదే రూట్లో ఓ వ్యక్తి వెళ్లడం చూడొచ్చు. అతడిని గమనించిన సచిన్... తన కారును నిలిపి ఆ బైకర్ ను కూడా ఆపాడు. అప్పుడా వ్యక్తి ముఖంలో కనిపించిన ఫీలింగ్ మాటలకు అందదు.

వెంటనే ఆ వ్యక్తి రెండు చేతులు జోడించి సచిన్ కు నమస్కరించాడు. అంతేకాదు, తన చేతిపై ఉన్న పచ్చ బొట్టును, తన బైక్ కవర్ లో ఉన్న సచిన్ ఫొటోలతో కూడిన బుక్ ను చూపించడంతో సచిన్ సంబరపడిపోయాడు. ఆ బుక్ లో ఆటోగ్రాఫ్ చేసి తన వీరాభిమానిని సంతోషపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్ లో పోస్టు చేసిన సచిన్... "నాపై ఆ అభిమాని చూపిన అపారమైన ప్రేమతో నా హృదయం సంతోషంతో నిండిపోయింది. జీవితంలో ఊహించని కోణాల్లోనూ ఇలా వ్యక్తుల నుంచి ప్రేమ లభిస్తుండడం జీవితాన్ని ఎంతో ప్రత్యేకంగా మార్చివేస్తుంది" అని పేర్కొన్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)