భారత క్రికెట్ జట్టులోకి వైజాగ్ కుర్రాడు కోన శ్రీకర్ భరత్ అరంగేట్రం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఈ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా భరత్ ఫొటో షేర్ చేస్తూ అభినందనలు తెలియజేశారు.
తెలుగు జాతి గర్వపడేలా మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కాగా ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్‌లో గురువారం ఆరంభమైన తొలి టెస్టుతో ఆంధ్ర ఆటగాడు కేఎస్ భరత్ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. భరత్‌తో పాటు టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ భారత్ తరఫున తొలి టెస్టు ఆడుతున్నాడు.ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన శ్రీకర్ భరత్ 1993, అక్టోబరు 3న జన్మించాడు.2012లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అతడు అరంగేట్రం చేశాడు.
శ్రీకర్ భరత్‌ను ఐపీఎల్ మినీ వేలం-2021లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసింది. అంతకుముందు అతడు ఢిల్లీ డేర్‌డెవిల్స్(ఢిల్లీ క్యాపిటల్స్)కు ప్రాతినిథ్యం వహించినా మ్యాచ్ ఆడే అవకాశం మాత్రం రాలేదు. ఐపీఎల్-2021 సీజన్‌లో కోహ్లి కెప్టెన్సీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన భరత్ 191 పరుగులు సాధించాడు.ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భరత్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టి బెంగళూరు జట్టును గెలిపించాడు. ఐపీఎల్-2023 వేలంలో గుజరాత్ టైటాన్స్ 1.2 కోట్ల రూపాయలు వెచ్చించి సొంతం చేసుకుంది.
Here's BCCI Tweet
Debut in international cricket for @KonaBharat 👍 👍
A special moment for him as he receives his Test cap from @cheteshwar1 👌 👌#TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/dRxQy8IRvZ
— BCCI (@BCCI) February 9, 2023
Here's CM Jagan Tweet
Our very own @KonaBharat is debuting today with the Indian Cricket Team in the ongoing test against Australia. My congratulations and best wishes to him.
The Telugu flag continues to fly high!#TeluguPride pic.twitter.com/KlDACbHBhF
— YS Jagan Mohan Reddy (@ysjagan) February 9, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)