టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభమైంది. నేడు మొహాలీలో ఇరుజట్ల మధ్య తొలి వన్డే జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా ఏస్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ (5/51) ఐదు వికెట్లతో రెచ్చిపోవడంతో తొలి వన్డేలో ఆసీస్‌ 276 పరుగులకు ఆలౌటైంది. షమీ కెరీర్‌లో ఇవి అత్యుత్తమ గణాంకాలు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో మిచెల్‌ మార్ష్‌ (4), వార్నర్‌ (52), స్టీవ్‌ స్మిత్‌ (41), మార్నస్‌ లబూషేన్‌ (39), కెమరూన్‌ గ్రీన్‌ (31), ఇంగ్లిస్‌ (45), స్టోయినిస్‌ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆఖర్లో కమిన్స్‌ (21 నాటౌట్‌) వేగంగా పరుగులు రాబట్టాడు. భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్‌, జడేజాలకు తలో వికెట్‌ దక్కాయి.

Mohammed Shami (Photo-BCCI)

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)