ఉప్పల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బంతితో మెరిశాడు. సంచలన బంతితో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్65 ఓవర్‌లో బుమ్రా వేసిన మూడో బంతిని స్టోక్స్.. ఫ్రంట్ ఫుట్‌కు వచ్చి వికెట్లను వదిలేసి షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.బంతి అనూహ్యంగా టర్న్ అయ్యి స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో బిత్తర పోయిన స్టోక్స్.. ఏమి బాల్ వేశావు బ్రో అన్నట్లు రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో మహ్మద్ షమీ కూడా ఈ విధంగానే స్టోక్స్‌ను ఔట్ చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో బుమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు.
Here's Video
B. O. O. M 🎯
Absolute Cracker ⚡️ ⚡️@Jaspritbumrah93 🤝 Timber Strike
Relive that wicket 🎥 🔽
Follow the match ▶️ https://t.co/HGTxXf8b1E#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/sMHBIryZ5H
— BCCI (@BCCI) January 25, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)