ఇండియ‌న్ క్రికెట్ టీమ్ ఆటగాడు చెటేశ్వ‌ర్ పుజారా ఈ మ‌ధ్య మ‌రీ నిదానంగా బ్యాటింగ్ చేస్తూ బోర్ కొట్టిస్తున్నాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లోనూ పుజారా మ‌రోసారి ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌తోపాటు అభిమానుల స‌హ‌నాన్ని ప‌రీక్షించాడు. అత‌డు త‌న తొలి ప‌రుగు చేయ‌డానికి ఏకంగా 36 బంతులు తీసుకున్నాడు. 36వ బంతికి ఫోర్ కొట్టి పుజారా ఖాతా తెరిచాడు. ఆ వెంటనే మ‌రో ఫోర్ కొట్టిన అత‌డు చివ‌రికి 54 బంతుల్లో 8 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. అత‌ని ఇన్నింగ్స్‌పై ట్విట‌ర్‌లో జోకులు పేలుతున్నాయి. ఫ‌న్నీ మీమ్స్‌తో నెటిజ‌న్లు హోరెత్తిస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)