ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లుగా గుర్తింపు పొందిన చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ బోణీ కొట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న చోట కొత్త ఫ్రాంచైజీ లక్నో సూపర్‌ జెయింట్స్‌ హ్యాట్రిక్‌ విజయం నమోదు చేసుకుంది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఢిల్లీ హిట్టర్లను కట్టడి చేసిన లక్నో.. డికాక్‌ మెరుపులతో సునాయాసంగా విజయతీరాలకు చేరింది. గురువారం జరిగిన పోరులో లక్నో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో లక్నో 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ (52 బంతుల్లో 80; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) దంచికొడితే.. ఆఖర్లో ఆయుశ్‌ బదోనీ (3 బంతుల్లో 10 నాటౌట్‌; ఒక ఫోర్‌, ఒక సిక్సర్‌) తనదైన శైలిలో ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)