ఐపీఎల్‌-2024లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ యువ ఓపెన‌ర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.కేవలం 19 బంతుల్లోనే మెక్‌గుర్క్ తన హాఫ్ సెంచరీని అందుకున్నాడు. రాజస్తాన్ పేసర్ అవేష్ ఖాన్‌ను మెక్‌గుర్క్ ఊచకోత కోశాడు. ఢిల్లీ ఇన్నింగ్స్ 4వ ఓవర్ వేసిన అవేష్ ఖాన్ బౌలింగ్‌లో మెక్‌గుర్క్ 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో ఏకంగా 28 పరుగులు రాబట్టాడు. ఓవరాల్‌గా 20 బంతులు ఎదుర్కొన్న జేక్ ఫ్రేజర్ 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50 పరుగులు చేసి ఔటయ్యాడు. అత‌డి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతున్నాయి. ఇక ఈ ఏడాది సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 7 మ్యాచ్‌లు ఆడిన మెక్‌గుర్క్.. 44.14 స‌గ‌టుతో 309 ప‌రుగులు చేశాడు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)