అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లోని స్కూలులో విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో ఆత్మాహుతి దాడి జరిగిన సంగతి తెలిసిందే.ఒక ఆగంతకుడు బాంబు ధరించి క్లాస్‌రూంకు వెళ్లాడు. విద్యార్థులు మధ్య కూర్చున్న తర్వాత తనను తాను పేల్చుకున్నట్లు తెలిసింది. ఆత్మాహుతి దాడిలో 46 మంది బాలికలతో పాటు ఒక మహిళ మరణించినట్లు ఐక్యరాజ్యసమితి ద్రువీకరించింది. ఆ తర్వాత మరణించిన వారి సంఖ్య 53కు చేరుకోగా.. 110 మంది గాయపడినట్లు ఐరాస తన ట్విటర్‌లో ప్రకటించింది. ఈ ఘటనపై అఫ్గనిస్తాన్ క్రికెటర్లు రషీద్ ఖాన్, రహమత్ షాలు స్పందించారు. ''దయచేసి చదువును చంపేయకండి.. ఏమి తెలియని పిల్లలేం చేశారు.. వారిని ఎందుకు పొట్టబెట్టుకున్నారు.. ఇది చాలా బాధాకరం'' అంటూ పేర్కొన్నారు.
Kabul 💔💔 😢😢🤲🏻🤲🏻 #DontKillEducation 🙏🙏 pic.twitter.com/mxmRFsswmc
— Rashid Khan (@rashidkhan_19) September 30, 2022
💔💔💔😭😭😭🤲🏻🤲🏻🤲🏻…. pic.twitter.com/tqDGtAVbIv
— Rahmat Shah (@RahmatShah_08) October 1, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)